Monday, May 13, 2019

రాజ్యము, బలము, మహిమ నీవే నీవే ...

చిత్రం : రాజాధిరాజు (1980)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : మోదుకూరి జాన్సన్
గానం : పి.సుశీల


పల్లవి:

రాజ్యము, బలము, మహిమ నీవే నీవే
జవము, జీవము జీవనమీవేనీవే (2)

మరియ తనయ మధుర హృదయ (2)
కరుణామయా! కరుణామయా!


చరణం: 1

అవసరానికి మించి, ఐశ్వర్యమిస్తే
మనిషి కన్నుమిన్ను, కానబోడే మో

కడుపుకు చాలినంత, కబళమీయకుంటే
మనిషి నీతినియమం, పాటించడేమో

మనిషి మనుగడకు సరిపడనిచ్చి
శాంతి, ప్రేమ, తృప్తినిచ్చి

గుండె గుండె నీ గుడి దీపాలై
అడుగు అడుగు నీ ఆలయమయ్యే
రాజ్యమీవయ్యా... నీ రాజ్యమీవయ్యా


చరణం: 2

శిలువపైన నీ రక్తం చిందిననాడే
శమదమాలు శోభించెనుగాదా

నీ పునరుత్థానంతో రక్షణ రాజిల్లి
శోకం, మరణం మరణించెను గాదా

చావు, పుటుక నీ శ్వాసలని
దయా, దండన పరీక్షలని

ఉనికి ఉనికి నీ వెలుగు నీడలని
సత్యం, మార్గం, సర్వం నీవని
మహిమ తెలుపవయ్యా... నీ మహిమ తెలుపవయ్యా


చరణం: 3

అర్హత లేనివారికి అధికారం ఇస్తే
దయ ధర్మం దారి తప్పునేమో

దారి తప్పినవారిని చేరదీయకుంటే
తిరిగి తిరిగి తిరగబడతారేమో

తగినవారికి తగు బలమిచ్చి
సహనం క్షమ సఖ్యతనిచ్చి

తనువు తనువు నిరీక్షణశాలై
అణువు అణువు నీ రక్షణ సేనయ్యే
బలమీవయ్యా... ఆత్మబలమీవయ్యా

* * *

చిన్నారి స్నేహమా! చిరునామా తీసుకో ... (బాధగా)

చిత్రం :  చిన్నారి స్నేహం (1989)
రచన : వేటూరి
స్వరరచన : చక్రవర్తి
గాయకులు : బాలు
రాగం : ???

చరణం :

జన్మ కారణ పాపం, జంతువై పోతుంటే
కాలమే తన శీలం, కాటిలో తగలేస్తే

కలగన్న తీపి కోరికే, కన్నీరై రగులుతుంటే
గతజీవితాల జ్ఞాపకం, తన గమ్యం మరచిపోతే

ప్రేమే త్యాగమౌతున్నా, త్యాగం శోకమౌతున్నా
బ్రతుకే చితికి పోతున్నా, బలిగా నిన్ను చేస్తున్నా

గాలిలోని దీపమల్లె, జాలిగానె పాడుకో



పల్లవి :

చిన్నారి స్నేహమా! చిరునామా తీసుకో
గతమైన జీవితం, కథగానే రాసుకో

మనసైతే మళ్ళీ చదువుకో
మరుజన్మకైనా కలుసుకో

ఏనాటికేమౌతున్నా, ఏ గూడు నీదౌవుతున్నా
హాయిగానే ఆడుకో

చిన్నారి స్నేహమా! చిరునామా తీసుకో
గతమైన జీవితం కథగానే రాసుకో


* * *



చిన్నారి స్నేహమా! చిరునామా తీసుకో ...

చిత్రం :  చిన్నారి స్నేహం (1989)
రచన : వేటూరి
స్వరరచన : చక్రవర్తి
గాయకులు : బాలు, సుశీల, etc.,
రాగం : ???

పల్లవి :

చిన్నారి స్నేహమా! చిరునామా తీసుకో
గతమైన జీవితం, కథగానే రాసుకో

మనసైతే మళ్ళీ చదువుకో
మరుజన్మకైనా కలుసుకో

ఏనాటికేమౌతున్నా, ఏ గూడు నీదౌవుతున్నా
హాయిగానే ఆడుకో

చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
గతమైన జీవితం కథగానే రాసుకో


చరణం-1 :

జీవితం నీ కోసం, స్వాగతం పలికింది
ఆశలే వెలిగించి, హారతులు ఇస్తుంది

ఆకాశమంత ఆలయం, నీకోసం కట్టుకుంది
కళ్యాణ తోరణాలుగా, నీ బ్రతుకే మార్చుతుంది

స్నేహం పెంచుకుంటుంది, ప్రేమే పంచమంటుంది
కాలం కరిగి పోతుంటే, కలగా చెదిరిపోతుంది

మాసిపోని గాయమల్లే, గుండెలోనే ఉంటుంది


పల్లవి :

చిన్నారి స్నేహమా! చిరునామా తీసుకో
గతమైన జీవితం, కథగానే రాసుకో


చరణం-2 :

ఆశయం కావాలి, ఆశలే తీరాలి
మనిషిలో దేవుణ్ణి, మనసుతో గెలవాలి

అందాల జీవితానికో అనుబంధం చూసుకో
అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో

లోకం చీకటౌతున్నా, బ్రతుకే భారమౌతున్నా
మనసే జ్యోతి కావాలి, మనిషే వెలుగు చూపాలి

మరో ప్రపంచ మానవుడిగా ముందు దారి చూడాలి


పల్లవి :

చిన్నారి స్నేహమా! చిరునామా తీసుకో
గతమైన జీవితం, కథగానే రాసుకో

మనసైతే మళ్ళీ చదువుకో
మరుజన్మకైనా కలుసుకో

ఏనాటికేమౌతున్నా, ఏ గూడు నీదౌవుతున్నా
హాయిగానే ఆడుకో

చిన్నారి స్నేహమా! చిరునామా తీసుకో
గతమైన జీవితం, కథగానే రాసుకో


* * *




Wednesday, March 10, 2010

నీ కౌగిలిలో.....

చిత్రం : కార్తీక దీపం (1979)
రచన : గోపి
సంగీతం : సత్యం
గాయకులు : బాలు, జానకి
రాగం : కానడ

పల్లవి :


నీ కౌగిలిలో తల దాచి
నీ చేతులలో కనుమూసి
జన్మ జన్మకు జతగా మసలే
వరమే నన్ను పొందని

నీ కౌగిలిలో తల దాచి

చరణం-1 :


చల్లగ తాకే పాల వెన్నెల, నా మనసేదో వివరించు
అల్లరి చేసే ఓ చిరుగాలి, నా కోరికలే వినిపించు
నా కోవెలలో, స్వామివి నీవై
మనసే దివ్వెగా వెలిగించు


          నీ కౌగిలిలో తల దాచి 
          నీ చేతులలో కనుమూసి
          జన్మ జన్మకు జతగా మసలే
          వరమే నన్ను పొందని

          నీ కౌగిలిలో తల దాచి 

చరణం-2 :

నింగి సాక్షి, నేల సాక్షి, నిను వలచిన నా మనసే సాక్షి
మనసులోన, మనుగడ లోన, నాలో నీవే సగపాలు
వేడుకలోను, వేదనలోను, పాలు  తేనెగా ఉందాము

          నీ కౌగిలిలో తల దాచి 
          నీ చేతులలో కనుమూసి
          జన్మ జన్మకు జతగా మసలే
          వరమే నన్ను పొందని

          నీ కౌగిలిలో తల దాచి 

* * *

మా ఇంటిలోన.....

చిత్రం : కొండవీటి సింహం (1981)
రచన : వేటూరి
స్వరకర్త : చక్రవర్తి
గాయకులు : బాలు, సుశీల
రాగం : 


పల్లవి :

మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే
మా కంట వెలిగే గృహ లక్ష్మి నీవే
సిరులెన్నో వున్నా, చిరు నవ్వు నీవే
నీ కంట తడిని, నే చూడలేను

మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే

చరణం-1 :


గోరంత పసుపు నీవడిగినావు
నూరేళ్ళ బ్రతుకు మాకిచ్చినావు
క్షణమొక్క రుణమై పెరిగింది బంధం
త్యాగాల మయమై సంసార బంధం
నీ చేయి తాకి చివురించె చైత్రం
ఈ హస్త వాసే నాకున్న నేస్తం, అనురాగ సూత్రం

          మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే
          సిరులెన్నో వున్నా, చిరు నవ్వు నీదే
          నీ కంట తడిని, నే చూడలేను


చరణం-2 :

మా అమ్మ నీవై కనిపించి నావు
ఈ బొమ్మ నేపుడో కదిలించి నావు
నిను చూడగానే పొంగింది రక్తం
కనుచూపులోనే మెరిసింది పాశం
నీ కంటి చూపే కార్తీక దీపం
దైవాలకన్న దయ ఉన్న రూపం
ఈ ఇంటి దీపం

          మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే

          మా కంట వెలిగే గృహ లక్ష్మి నీవే
          సిరులెన్నో వున్నా, చిరు నవ్వు నీవే
          నీ కంట తడిని, నే చూడలేను

          మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే
          మా కంట వెలిగే గృహ లక్ష్మి నీవే

* * *

Tuesday, March 2, 2010

రానేలా వసంతాలే.....

చిత్రం : డాన్స్ మాస్టర్ (1986)
రచన : వేటూరి
సంగీతం : ఇళయ రాజా
గానం : చిత్ర
రాగం : పహాడి


రానేలా వసంతాలే, శృతి కానేలా సరాగాలే
నీవే నా జీవన రాగం, వరాలా బంధం
నీవే నా యవ్వన కావ్యం, స్మరించే గీతం

రానేలా వసంతాలే

ఈ మౌన పంజరాన, నే మూగనై
నీ వేణువూదగానే, నే రాగమై
ఇగిరే శోకమై, విరిసే తోటనై
ఏ పాట పాడిన, అది పూవులై
అవి నేల రాలిన, చిరు తావినై
బదులైన లేని, ఆశలారబోసి

రానేలా వసంతాలే

ఓ ప్రేమికా చెలియా, ఒడి చేరవా
నీ చెలిమిని ఇపుడే, దరి జేర్చవా
రగిలే తాపమే, ఎదలో తీరదా
నీ చూపుతోనే, చలి తీరదా
నీ స్పర్శతోనే, మది పాడదా
ఎదమీటి పోయే, ప్రేమగీతిలాగా

రానేలా వసంతాలే, శృతి కానేలా సరాగాలే
నీవే నా జీవన రాగం, వరాలా బంధం
నీవే నా యవ్వన కావ్యం, స్మరించే గీతం

రానేలా వసంతాలే, శృతి కానేలా సరాగాలే

* * *

Saturday, February 27, 2010

తొలి చూపు చెలి రాసిన శుభలేఖ.....

చిత్రం : రాజ్ కుమార్ (1983)
రచన : వేటూరి
సంగీతం : ఇళయ రాజా
గానం : బాలు, జానకి
రాగం : కళ్యాణి


తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
పలుకే లేనిది, ప్రియ భాషా
పలుకే లేనిది, ప్రియ భాషా
తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
తొలి చూపు చెలి రాసిన శుభలేక


కన్ను కన్ను నవ కళ్యాణి లో, రాగాలెన్నో పలికే
అందాలన్నీ బిగి కౌగిళ్ళకే, రావాలని అలిగే
ప్రాణాలన్ని మరు బాణా లైదు గా చేసే ప్రేమ కావ్యం
తొలి పాట చెలికంకితం, చెలి నీడ నా జీవితం
ఆరారు కాలాల కిది కామితం


తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
పలుకే లేనిది, ప్రియ భాషా
తొలి చూపు చెలి రాసిన శుభలేఖ


బృందావని సుమ గంధాలతో, శృంగారాలే వగచీ
చింతామణీ లయ లాస్యాలతో, సౌందర్యాలే తలచీ
కార్తీకాల తొలి కన్హారాల తో వేస్తా ప్రేమ హారం
కుసుమించే చెలి యవ్వనం, నా మదికే నీరాజనం
ఏడేడు జన్మాల కిది శాశ్వతం


తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
పలుకే లేనిది, ప్రియ భాషా
తొలి చూపు చెలి రాసిన శుభలేఖ


* * *