చిత్రం : రాజ్ కుమార్ (1983)
రచన : వేటూరి
సంగీతం : ఇళయ రాజా
గానం : బాలు, జానకి
రాగం : కళ్యాణి
తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
పలుకే లేనిది, ప్రియ భాషా
పలుకే లేనిది, ప్రియ భాషా
తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
తొలి చూపు చెలి రాసిన శుభలేక
కన్ను కన్ను నవ కళ్యాణి లో, రాగాలెన్నో పలికే
అందాలన్నీ బిగి కౌగిళ్ళకే, రావాలని అలిగే
ప్రాణాలన్ని మరు బాణా లైదు గా చేసే ప్రేమ కావ్యం
తొలి పాట చెలికంకితం, చెలి నీడ నా జీవితం
ఆరారు కాలాల కిది కామితం
తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
పలుకే లేనిది, ప్రియ భాషా
తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
బృందావని సుమ గంధాలతో, శృంగారాలే వగచీ
చింతామణీ లయ లాస్యాలతో, సౌందర్యాలే తలచీ
కార్తీకాల తొలి కన్హారాల తో వేస్తా ప్రేమ హారం
కుసుమించే చెలి యవ్వనం, నా మదికే నీరాజనం
ఏడేడు జన్మాల కిది శాశ్వతం
తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
పలుకే లేనిది, ప్రియ భాషా
తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
* * *
Saturday, February 27, 2010
Thursday, February 25, 2010
పాడుతా తీయగా చల్లగా.....
చిత్రం : మూగ మనసులు (1964)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గాత్రం : ఘంటశాల
రాగం : ?
పాడుతా తీయగా చల్లగా
పాడుతా తీయగా చల్లగా,
పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా
పాడుతా తీయగా చల్లగా
కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది
కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది
కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకు
కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకు
ఆ కలిమి కూడా దోచుకొనే దొరలు ఎందుకు?
పాడుతా తీయగా చల్లగా,
పసిపాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా
పాడుతా తీయగా చల్లగా
గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్లు
ఉండమన్న ఉండవమ్మ చాన్నాళ్ళు
గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్లు
ఉండమన్న ఉండవమ్మ చాన్నాళ్ళు
పోయినోళ్ళు అందరు మంచోళ్ళు
పోయినోళ్ళు అందరు మంచోళ్ళు
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు
పాడుతా తీయగా చల్లగా,
పసిపాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా
పాడుతా తీయగా చల్లగా
మనిషి పోతె మాత్రమేమి మనసు ఉంటది
మనసు తోటి మనసెపుడో కలసి పోతది
మనిషి పోతె మాత్రమేమి మనసు ఉంటది
మనసు తోటి మనసెపుడో కలసి పోతది
చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది
చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది
జనమ జనమ కది మరీ గట్టి పడతది
పాడుతా తీయగా చల్లగా,
పసిపాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా
పాడుతా తీయగా చల్లగా....
* * *
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గాత్రం : ఘంటశాల
రాగం : ?
పాడుతా తీయగా చల్లగా
పాడుతా తీయగా చల్లగా,
పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా
పాడుతా తీయగా చల్లగా
కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది
కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది
కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకు
కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకు
ఆ కలిమి కూడా దోచుకొనే దొరలు ఎందుకు?
పాడుతా తీయగా చల్లగా,
పసిపాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా
పాడుతా తీయగా చల్లగా
గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్లు
ఉండమన్న ఉండవమ్మ చాన్నాళ్ళు
గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్లు
ఉండమన్న ఉండవమ్మ చాన్నాళ్ళు
పోయినోళ్ళు అందరు మంచోళ్ళు
పోయినోళ్ళు అందరు మంచోళ్ళు
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు
పాడుతా తీయగా చల్లగా,
పసిపాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా
పాడుతా తీయగా చల్లగా
మనిషి పోతె మాత్రమేమి మనసు ఉంటది
మనసు తోటి మనసెపుడో కలసి పోతది
మనిషి పోతె మాత్రమేమి మనసు ఉంటది
మనసు తోటి మనసెపుడో కలసి పోతది
చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది
చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది
జనమ జనమ కది మరీ గట్టి పడతది
పాడుతా తీయగా చల్లగా,
పసిపాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా
పాడుతా తీయగా చల్లగా....
* * *
ఏ తీగ పూవునో, ఏ కొమ్మ తేటినో.....
చిత్రం : మరో చరిత్ర
రచన : ఆచార్య ఆత్రేయ
స్వర కర్త : ఎం.ఎస్.విశ్వనాథన్
గాత్రం : బాలు
రాగం : రేవతి
ఏ తీగ పూవునో, ఏ కొమ్మ తేటినో, కలిపింది ఏ వింత అనుబంధమౌనో
ఏ తీగ పూవునో, ఏ కొమ్మ తేటినో, కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
మనసు మూగది, మాటలు రానిది, మమత ఒకటే అది నేర్చినది
మనసు మూగది, మాటలు రానిది, మమత ఒకటే అది నేర్చినది
భాష లేనిది, బంధమున్నది.... భాష లేనిది, బంధమున్నది
మన ఇద్దరినీ జతకూర్చినది.... మన ఇద్దరినీ జతకూర్చినది
ఏ తీగ పూవునో, ఏ కొమ్మ తేటినో, కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
వయసే వయసును పలుకరించినది, వలదన్నా అది నిలువకున్నది
వయసే వయసును పలుకరించినది, వలదన్నా అది నిలువకున్నది
చేసిన బాస శిలవలె నిలచి, చేసిన బాస శిలవలె నిలచి
చివరికి మంచై కరుగుతున్నది, చివరికి మంచై కరుగుతున్నది
ఏ తీగ పూవునో, ఏ కొమ్మ తేటినో, కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
* * *
Labels:
ఆత్రేయ,
ఎం.ఎస్.విశ్వనాథన్,
బాలు,
మరో చరిత్ర
Wednesday, February 24, 2010
లిపిలేని కంటి బాస.....
చిత్రం : శ్రీ వారికీ ప్రేమలేఖ (1984)
రచన : వేటూరి
స్వరకర్త : రమేష్ నాయుడు
గాయకులు : బాలు, జానకి
రాగం : రేవతి
లిపిలేని కంటి బాస, తెలిపింది చిలిపి ఆశ
నీ కన్నుల కాటుక లేఖలలో
నీ సొగసుల కవితా రేఖలలో
ఇలా, ఇలా, చదవని, నీ లేఖని, ప్రణయ లేఖని
బదులైన లేని లేఖ, బతుకైన ప్రేమ లేఖ
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో, నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా, ఇలా, వ్రాయని నా లేఖని, ప్రణయ లేఖని
లిపిలేని కంటి బాస, తెలిసింది చిలిపి ఆశ
అమావాస్య నిశిలో, కోటి తారలున్న ఆకాశం
వెదుకుతు ఉంది, వేదన తానై, విదియ నాటి జాబిలి కోసం
వెలుగు నీడలేన్నున్నా, వెలగలేని ఆకాశం
ఎదుగుతు ఉంది, వెన్నెల తానై, ఒక్కనాటి పున్నమి కోసం
లిపిలేని కంటి బాస, తెలిసింది చిలిపి ఆశ
అక్షరాల నీడలలో, నీ జాడలు చూచుకుని
ఆ పదాల అల్లికలో నీ పెదవులు అద్దుకుని
నీ కంటికి పాపను నేనై, నీ ఇంటికి వాకిలి నేనై
గడప దాట లేక, నన్నే గడియ వేసుకున్నాను
గడియైనా నీవులేక గడపలేక ఉన్నాను
బదులైన లేని లేఖ, బ్రతుకైనా ప్రేమ లేఖ
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో, నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా, ఇలా, వ్రాయని నా లేఖని, ప్రణయ లేఖని
లిపిలేని కంటి బాస, తెలిపింది చిలిపి ఆశ
* * *
Labels:
జానకి,
బాలు,
రమేష్ నాయుడు,
వేటూరి,
శ్రీ వారికీ ప్రేమలేఖ
విధి చేయు వింతలన్నీ.....
చిత్రం : మరో చరిత్ర (1978)
రచన : ఆచార్య ఆత్రేయ
స్వర కర్త : M.S. విశ్వనాథన్
గాయకి : వాణీ జైరాం
రాగం: ?
విధి చేయు వింతలన్నీ, మతిలేని చేష్టలేనని
విరహాన వేగిపోయి, విలపించే కథలు ఎన్నో
విధిచేయు వింతలన్నీ, మతిలేని చేష్టలేనని
విరహాన వేగిపోయి, విలపించే కథలు ఎన్నో
విలపించే కథలు ఎన్నో
ఎదురు చూపులో ఎదను పిండగ, ఏళ్ళు గడిపెను శకుంతల
విరహ బాధను మరచిపోవగా, నిదుర పోయెను ఊర్మిళ
అనురాగమే నిజమని, మనసొకటి దాని రుజువని
తుది జయము ప్రేమదేనని, బలియైనవి బ్రతుకులెన్నో
విధిచేయు వింతలన్నీ
వలచి గెలిచి కలలు పండిన జంట లేదీ ఇలలో
కులము, మతము, ధనము, బలము, గొంతు కోసెను తుదిలో
అది నేడు జరుగరాదని, ఎడబాసి వేచినాము
మన గాధ యువతరాలకు, కావాలి మరో చరిత్ర
కావాలి మరో చరిత్ర
* * *
రచన : ఆచార్య ఆత్రేయ
స్వర కర్త : M.S. విశ్వనాథన్
గాయకి : వాణీ జైరాం
రాగం: ?
విధి చేయు వింతలన్నీ, మతిలేని చేష్టలేనని
విరహాన వేగిపోయి, విలపించే కథలు ఎన్నో
విధిచేయు వింతలన్నీ, మతిలేని చేష్టలేనని
విరహాన వేగిపోయి, విలపించే కథలు ఎన్నో
విలపించే కథలు ఎన్నో
ఎదురు చూపులో ఎదను పిండగ, ఏళ్ళు గడిపెను శకుంతల
విరహ బాధను మరచిపోవగా, నిదుర పోయెను ఊర్మిళ
అనురాగమే నిజమని, మనసొకటి దాని రుజువని
తుది జయము ప్రేమదేనని, బలియైనవి బ్రతుకులెన్నో
విధిచేయు వింతలన్నీ
వలచి గెలిచి కలలు పండిన జంట లేదీ ఇలలో
కులము, మతము, ధనము, బలము, గొంతు కోసెను తుదిలో
అది నేడు జరుగరాదని, ఎడబాసి వేచినాము
మన గాధ యువతరాలకు, కావాలి మరో చరిత్ర
కావాలి మరో చరిత్ర
* * *
Labels:
ఆత్రేయ,
ఎం.ఎస్.విశ్వనాథన్,
మరో చరిత్ర,
వాణీ జైరాం
Subscribe to:
Comments (Atom)