Wednesday, March 10, 2010

నీ కౌగిలిలో.....

చిత్రం : కార్తీక దీపం (1979)
రచన : గోపి
సంగీతం : సత్యం
గాయకులు : బాలు, జానకి
రాగం : కానడ

పల్లవి :


నీ కౌగిలిలో తల దాచి
నీ చేతులలో కనుమూసి
జన్మ జన్మకు జతగా మసలే
వరమే నన్ను పొందని

నీ కౌగిలిలో తల దాచి

చరణం-1 :


చల్లగ తాకే పాల వెన్నెల, నా మనసేదో వివరించు
అల్లరి చేసే ఓ చిరుగాలి, నా కోరికలే వినిపించు
నా కోవెలలో, స్వామివి నీవై
మనసే దివ్వెగా వెలిగించు


          నీ కౌగిలిలో తల దాచి 
          నీ చేతులలో కనుమూసి
          జన్మ జన్మకు జతగా మసలే
          వరమే నన్ను పొందని

          నీ కౌగిలిలో తల దాచి 

చరణం-2 :

నింగి సాక్షి, నేల సాక్షి, నిను వలచిన నా మనసే సాక్షి
మనసులోన, మనుగడ లోన, నాలో నీవే సగపాలు
వేడుకలోను, వేదనలోను, పాలు  తేనెగా ఉందాము

          నీ కౌగిలిలో తల దాచి 
          నీ చేతులలో కనుమూసి
          జన్మ జన్మకు జతగా మసలే
          వరమే నన్ను పొందని

          నీ కౌగిలిలో తల దాచి 

* * *

మా ఇంటిలోన.....

చిత్రం : కొండవీటి సింహం (1981)
రచన : వేటూరి
స్వరకర్త : చక్రవర్తి
గాయకులు : బాలు, సుశీల
రాగం : 


పల్లవి :

మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే
మా కంట వెలిగే గృహ లక్ష్మి నీవే
సిరులెన్నో వున్నా, చిరు నవ్వు నీవే
నీ కంట తడిని, నే చూడలేను

మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే

చరణం-1 :


గోరంత పసుపు నీవడిగినావు
నూరేళ్ళ బ్రతుకు మాకిచ్చినావు
క్షణమొక్క రుణమై పెరిగింది బంధం
త్యాగాల మయమై సంసార బంధం
నీ చేయి తాకి చివురించె చైత్రం
ఈ హస్త వాసే నాకున్న నేస్తం, అనురాగ సూత్రం

          మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే
          సిరులెన్నో వున్నా, చిరు నవ్వు నీదే
          నీ కంట తడిని, నే చూడలేను


చరణం-2 :

మా అమ్మ నీవై కనిపించి నావు
ఈ బొమ్మ నేపుడో కదిలించి నావు
నిను చూడగానే పొంగింది రక్తం
కనుచూపులోనే మెరిసింది పాశం
నీ కంటి చూపే కార్తీక దీపం
దైవాలకన్న దయ ఉన్న రూపం
ఈ ఇంటి దీపం

          మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే

          మా కంట వెలిగే గృహ లక్ష్మి నీవే
          సిరులెన్నో వున్నా, చిరు నవ్వు నీవే
          నీ కంట తడిని, నే చూడలేను

          మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే
          మా కంట వెలిగే గృహ లక్ష్మి నీవే

* * *

Tuesday, March 2, 2010

రానేలా వసంతాలే.....

చిత్రం : డాన్స్ మాస్టర్ (1986)
రచన : వేటూరి
సంగీతం : ఇళయ రాజా
గానం : చిత్ర
రాగం : పహాడి


రానేలా వసంతాలే, శృతి కానేలా సరాగాలే
నీవే నా జీవన రాగం, వరాలా బంధం
నీవే నా యవ్వన కావ్యం, స్మరించే గీతం

రానేలా వసంతాలే

ఈ మౌన పంజరాన, నే మూగనై
నీ వేణువూదగానే, నే రాగమై
ఇగిరే శోకమై, విరిసే తోటనై
ఏ పాట పాడిన, అది పూవులై
అవి నేల రాలిన, చిరు తావినై
బదులైన లేని, ఆశలారబోసి

రానేలా వసంతాలే

ఓ ప్రేమికా చెలియా, ఒడి చేరవా
నీ చెలిమిని ఇపుడే, దరి జేర్చవా
రగిలే తాపమే, ఎదలో తీరదా
నీ చూపుతోనే, చలి తీరదా
నీ స్పర్శతోనే, మది పాడదా
ఎదమీటి పోయే, ప్రేమగీతిలాగా

రానేలా వసంతాలే, శృతి కానేలా సరాగాలే
నీవే నా జీవన రాగం, వరాలా బంధం
నీవే నా యవ్వన కావ్యం, స్మరించే గీతం

రానేలా వసంతాలే, శృతి కానేలా సరాగాలే

* * *