Wednesday, March 10, 2010

మా ఇంటిలోన.....

చిత్రం : కొండవీటి సింహం (1981)
రచన : వేటూరి
స్వరకర్త : చక్రవర్తి
గాయకులు : బాలు, సుశీల
రాగం : 


పల్లవి :

మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే
మా కంట వెలిగే గృహ లక్ష్మి నీవే
సిరులెన్నో వున్నా, చిరు నవ్వు నీవే
నీ కంట తడిని, నే చూడలేను

మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే

చరణం-1 :


గోరంత పసుపు నీవడిగినావు
నూరేళ్ళ బ్రతుకు మాకిచ్చినావు
క్షణమొక్క రుణమై పెరిగింది బంధం
త్యాగాల మయమై సంసార బంధం
నీ చేయి తాకి చివురించె చైత్రం
ఈ హస్త వాసే నాకున్న నేస్తం, అనురాగ సూత్రం

          మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే
          సిరులెన్నో వున్నా, చిరు నవ్వు నీదే
          నీ కంట తడిని, నే చూడలేను


చరణం-2 :

మా అమ్మ నీవై కనిపించి నావు
ఈ బొమ్మ నేపుడో కదిలించి నావు
నిను చూడగానే పొంగింది రక్తం
కనుచూపులోనే మెరిసింది పాశం
నీ కంటి చూపే కార్తీక దీపం
దైవాలకన్న దయ ఉన్న రూపం
ఈ ఇంటి దీపం

          మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే

          మా కంట వెలిగే గృహ లక్ష్మి నీవే
          సిరులెన్నో వున్నా, చిరు నవ్వు నీవే
          నీ కంట తడిని, నే చూడలేను

          మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే
          మా కంట వెలిగే గృహ లక్ష్మి నీవే

* * *

No comments:

Post a Comment